హీరోల పేర్లు బయటపెడితే అవకాశాలు పోతాయ్..

  • In Film
  • September 6, 2019
  • 128 Views
హీరోల పేర్లు బయటపెడితే అవకాశాలు పోతాయ్..

వింక్‌గర్ల్ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తెలుగుతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనుంది. విష్ణుప్రియ’ అనే సినిమాతో కన్నడలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ‘కన్నడ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టేశారు. సూపర్స్టార్ యశ్తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా?’ అంటూ ఎదురైన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది. ”ఈ ప్రశ్నకు ఇంతకుముందు కూడా సమాధానమిచ్చాను. నేను ఎవ్వరి పేర్లు బయటికి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఫలానా హీరోతో మాత్రమే సినిమా చేయాలని ఉందని చెబితే నా చేతిలో ఉన్న మిగతా సినిమాలు పోతాయి. నేను అందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను” అంటూ బదులిచ్చింది.ఇక అందరూ తనను వింక్ గర్ల్ అని పిలుస్తున్నారని.. అలా పిలవొద్దని.. తన హావభావాలను వ్యక్తపరచడానికి తన కళ్లే కీలక పాత్ర పోషిస్తాయని.. కన్ను కొట్టడంతో పాటు ఈ సినిమాలో విభిన్నంగా నటించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos