మహాభారత్ స్టార్ట్ అవుతుంది

మహాభారత్ స్టార్ట్ అవుతుంది

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ను లోక్సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ సోన్కర్ ఆ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. కేంద్ర సర్కారుపై ప్రశ్నలు వేసేందుకు ఆమె ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. నిజానికి మహువా మొయిత్రాపై డిసెంబర్ 4వ తేదీనే ఎథిక్స్ కమిటీ రిపోర్టును ప్రవేశపెట్టాలని భావించారు. కానీ ఆలస్యం కావడంతో.. ఇవాళ ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై ఎంపీ మహువా స్పందించారు. వస్త్రాపరహణ మొదలైందని, ఇక ఇప్పుడు మహాభారత్ స్టార్ట్ అవుతుందని మహువా అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos