బుల్లితెరపై మహర్షి అట్టర్‌ ఫ్లాప్‌..

  • In Film
  • October 18, 2019
  • 175 Views
బుల్లితెరపై మహర్షి అట్టర్‌ ఫ్లాప్‌..

ఈ ఏడాది మే నెలలో మహేశ్ 25వ చిత్రంగా విడుదలైన మహర్షి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.రూ.100 కోట్లు షేర్స్ వసూలు చేసి మహేశ్ స్టామినా చూపించింది.ఈ చిత్రం డిజిటల్ హక్కులు దక్కించుకున్న అమేజాన్ ప్రైమ్ సైతం మంచి లాభాలనే అందుకుంది.అయితే చిత్రం ప్రసార హక్కులను దక్కించుకున్న జెమిని టివికి మాత్రం మహర్షి పెద్ద షాకిచ్చింది.దసరా సందర్భంగా జెమిని టివి చిత్రాన్ని ప్రసారం చేయగా కేవలం 8.6 టీఆర్పీ సాధించి షాకిచ్చింది.మహేశ్ వంటి స్టార్ హీరో చిత్రానికి ఇంత తక్కువ మొత్తంలో టీఆర్పీ రావడం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. మహర్షి చిత్రంకు వచ్చిన బజ్ తో ఇతర ఛానెల్స్ తో పోటీ పడి భారీ మొత్తాన్ని కోట్ చేసి మరీ హక్కులు దక్కించుకున్న జెమిని వారికి టీఆర్పీ రేటింగ్ మింగుడు పడటం లేదట.5 నుండి 20 మద్యలో టీఆర్పీ రేటింగ్ వస్తుందని ఆశించిన 8.4 టీఆర్పీ దక్కడంపై అసంతృప్తిగా ఉన్నారని టాక్.
.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos