మావోయిస్టుల వేటకు ‘మహా’ హెలికాప్టర్‌

మావోయిస్టుల వేటకు ‘మహా’ హెలికాప్టర్‌

ముంబై: మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు రూ.72.43 కోట్ల ఫ్రెంచ్‌ తయారి హెచ్–145 హెలికాప్టర్‌ కొనాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. దీని వెల రూ.72.43 కోట్లు. ఇద్దరు పైలెట్లు, పది మంది దీనిలో ప్రయాణించ వచ్చు. ఈ హెలికాప్టర్ నడపటంలో ముగ్గురు సీనియర్‌ పైలెట్లు-సంజయ్‌ కర్వే, మహేంద్ర దల్వీ, మోహిత్‌ శర్మ జర్మనీలోని డోనవర్థ్‌–మాన్‌చింగ్‌లో 75 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న, అటవి ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను నడపటంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ వ్యయం రూ.7.30 లక్షలు. శిక్షణ అనంతరం ఆగస్టు 14న స్వ రాష్ట్రానికి చేరుకుంటారు. మావోయిస్టుల వేటకు గత ఎనిమిదేళ్లుగా పవన్ హన్స్ హెలికాప్టర్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంటోంది. బాడుగ మొత్తం ఏడాదికి రూ.25 కోట్లు. దీనికి బదులుగా హెలికాప్టర్‌ కొనటం మంచదని భావించింది. ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులకు సాయం అందించేందుకు, ప్రముఖుల ప్రయాణానికి కూడా దీన్ని వినియోగించదలచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos