మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.39 గంటల వేళకు సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 41,125 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 12,105 వద్ద నిలిచాయి. చాలా చోట్ల ఆందోళనలు జరగడంతో ప్రజల దృష్టి బలహీన మైన ఆర్థిక వ్యవస్థ నుంచి మళ్లింది. మారుతీ సుజుకీ 1.2శాతం లాభాల్ని గడించింది. ఈక్విటాస్ హోల్డింగ్ కూడా రెండు శాతం లాభపడింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ద్వారా రూ.1000 కోట్లు సమీకరణకు పత్రాల్ని సమర్పించడం ఇందుకు కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్, దేవాన్ హౌసింగ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లాభాల్లో, ట్రైడెంట్, పీసీ జ్యువెలర్స్, వర్లుపూల్, మాగ్మ ఫిన్కార్ప్, సుజ్లనాన్ ఎనర్జీ నష్టాల్లో వ్యాపారాల్ని చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos