పాక్ జెండా ఎగరేశాడు జైలుకెళ్లాడు..

పాక్ జెండా ఎగరేశాడు జైలుకెళ్లాడు..

మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేసి కలకలం సృష్టించాడు. దేవాస్ జిల్లా షిప్రా గ్రామంలో టైలర్ పని చేసుకునే ఫారూఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేసి కలకలం సృష్టించాడు.పాక్ జెండా ఎగురవేయడమే కాదు, దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.ఇది కాస్త పోలీసుల దృష్టిలో పడడంతో ఫారూఖ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి నివాసం నుంచి పాక్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కొద్దిమేర డ్రామా చోటుచేసుకుంది. ఈ జెండా ఎగురవేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఫారూఖ్ ఖాన్ ను ప్రశ్నించగా, మైనర్ అయిన తన కుమారుడు తెలియక ఎగరేశాడంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆ జెండాను తాను అప్పుడే తగులబెట్టానంటూ అధికారులతో నమ్మబలికాడు.కానీ సోదాలు చేయగా, ఆ జెండా సాధారణ స్థితిలోనే లభ్యమైంది. దాంతో అతడిపైనా, అతడి కుటుంబంలోని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos