శరద్‌ పవార్‌ పెద్ద అవకాశ వాది

శరద్‌ పవార్‌ పెద్ద అవకాశ వాది

మాధా:నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ పెద్ద అవకాశ వాది అని ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, మాధాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆరోపించారు. ‘లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో ఇప్పుడు అర్థమవుతోంది.  గాలి ఎక్కడ వీస్తే పవార్‌ ఆ గూటికి చేరతారని’ వ్యాఖ్యానించారు. చాలా కాలం తరవాత ప్రజలు అధికారంలో ఉన్న ప్రభుత్వమే తిరిగి రావాలనుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ప్రజలు ఇంటింటికీ తిరిగి తమ  ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారన్నారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌ భాజపా పాలనకు ముందు ముంబయి.. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండేదన్నారు. ఒకప్పుడు కేవలం నన్ను మాత్రమే దూషించిన కాంగ్రెస్‌ ఇప్పుడు తన మొత్తం సామాజిక వర్గాన్నినిందిస్తోందన్నారు.తను వెనక బడిన వర్గానికి చెందిన వ్యక్తి కావటం వల్లే  కాంగ్రెస్‌ తనని లక్ష్యంగా చేసుకుందన్నారు. దేశంలో ఓ వర్గం మొత్తాన్ని దొంగలుగా అభివర్ణిస్తు న్నారన్నారు. పరోక్షంగా ‘దొంగ లంతా మోదీ పేరుతో ఉన్నార’ని రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దేశం అభివృద్ధి దిశలో సాగాలంటే తిరిగి భాజపాయే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos