జాబిల్లి పరిధిలోకి చంద్రయాన్-2

జాబిల్లి పరిధిలోకి చంద్రయాన్-2

బెంగళూరు: చంద్రయాన్-2 వ్యోమనౌక బుధవారం తెల్లవారు జామున భూ కక్ష్యను వీడి చంద్ర గ్రహం పరిధిలోకి ప్రవేశించినట్లు ఇస్రో బుధవారం ఇక్కడ ప్రకటించింది. 1203 సెకనుల పాటు ఉదయం 2 గంటల 21 నిమిషాలకు ద్రవ ఇంజన్ను మండించి చంద్రయాన్-2ను చంద్రుడి పరిధిలోకి శాస్త్రవేత్తలు మళ్లించారు. అది ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇందుకోసం మరో నాలుగు సార్లు కక్ష్య మార్పిడి చర్యల్ని చేపడతారు. సెప్టెంబర్ రెండున చంద్రయాన్-2 జాబిల్లికి 100 కి.మీల ఎత్తులో సంచరించేలా చేయనెఉన్నారు. అదే రోజు ఆర్బిటర్ వ్యోమనౌక నుంచి విడిపోయేలా చేస్తారు. అనంతరం రెండు సార్లు కక్ష్య మార్పు విన్యాసాలు నిర్వహించి చంద్రుని దక్షిణ ధృవంపై సెప్టెంబర్ ఏడున ఆర్బిటర్ నుంచి లాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. తదుపరి ప్రగ్యాన్ రోవర్ లాండర్ వెలుపలకు వచ్చి 500 మీటర్ల పరిధిలో సంచరించి పరిశోధనలు చేసి సమాచారాన్ని భూమికి అందించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos