మొదలైన గ్యాస్‌ బండ బాదుడు

మొదలైన గ్యాస్‌ బండ బాదుడు

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50కు చేరింది. ఇక కోల్కతాలో రూ.1908, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1968.50కు పెరిగింది. ఇక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో రాజధానులైన జైపూర్ (రాజస్థాన్) రూ.1819, భోపాల్ (మధ్యప్రదేశ్) రూ.1804, రాయ్పూర్ (ఛత్తీస్గఢ్) రూ.2004, హైదరాబాద్లో రూ.2024.5గా ఉన్నది. కాగా, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరలు పెరగకపోవడం ఒకింత ఉపశమనం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos