చైనా యువకుడు ప్రేమకు నిర్వచనంగా నిలిచాడు..

చైనా యువకుడు ప్రేమకు నిర్వచనంగా నిలిచాడు..

సాధారణంగా ప్రేమికులు చెప్పుకునే మాటల్లో మరణం కూడా మనల్ని విడదీయలేదని,మరణంలో కూడా తోడుగా ఉంటానని ఇటువంటి మాటలు చాలా సహజంగా వినిపిస్తుంటాయి.అయితే నూటికి 99 శాతం ప్రేమికులు వీటిని చేతలకు కాకుండా కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతాయి.మిగిలిన ఆ ఒక్క శాతం ఎక్కడో ఒకచోట కచ్చితంగా ఉంటారు.చైనాకు చెందిన ఓ యువకుడు కూడా ఆ ఒక్క శాతం కోవకే చెందుతాడు.ప్రియురాలి మరణంలో తోడు కాకపోయినా ప్రియురాలి చివరి కోరికను తీర్చి తన ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పాడు. చైనాకు చెందిన జూ షినాన్, యాంగ్ లియూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకునేందుకు 2013లో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. అయితే మూడు నెలల తరువాత యంగ్కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వెల్లడైంది. నాలుగేళ్ల పాటు యంగ్కు శస్త్ర చికిత్సతో పాటు కీమోథెరపీ కూడా కొనసాగడంతో కోలుకుంది.అయితే ఏడాది తరువాత ఆమెకు తిరిగి కేన్సర్ సోకింది. దీంతో ఆమె మళ్లీ చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2019 అక్టోబర్ 6న ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె మృతి చెందింది. కాగా యాంగ్ ఆసుపత్రితో చేరేముందు ఒక పెళ్లి గౌనును ఇష్టపడిందని జూ తెలుసుకున్నాడు.అందుకే ఆమె కోసం ఆ అందమైన గౌనును కొనుగోలు చేశాడు. దానిని యాంగ్ మృతదేహానికి ధరింపజేసి, ఆమెను వివాహం చేసుకుని ప్రియురాలి చివరి కోర్కెను తీర్చాడు. కాగా.. వీరి పెళ్లి వార్త స్థానికంగా వైరల్ అయ్యింది. అతని ప్రేమను ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos