తెదేపా అంతానికి పావులు కదుపుతున్న కమలం

తెదేపా అంతానికి పావులు కదుపుతున్న కమలం

అమరావతి: రాష్ట్రంలో భాజపా బలోపేతానికి నాయకత్వం పావులు కదుపుతోంది. దిగువ సభ ఎన్నికల్లో వైకాపా గెలిచి తెదేపా ఘోరంగా ఓడి పోయింది. తెదేపాకు కీలక నేతలకు కాషాయ తీర్థాన్ని ఇచ్చేందుకు ప్రయత్ని స్తున్నట్లు సమాచారం. ఏడాదిలోగానే ఈ తతంగాన్ని ముగించి భాజపాను క్రియాశీలం చేయదలచినట్లు తెలిసింది. తెదేపాలో కీలక నేతలే లక్ష్యంగా భాజపా ఆపరేషన్ కమల ఆకర్ష ప్రారంభించినట్లు సమాచారం. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పాలకొల్లు విధానసభ సభ్యుడు రామానాయుడు భాజపాలో చేరుతారని జరిగిన ప్రచారాన్ని వారు ఖండించారు. 2014 ఎన్నికల్లో భాజపా, తెదేపా కలిసి పోటీ చేశాయి. ఏడాదికిందట రెండింటి మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఇటీవల జరిగిన దిగువ సభ ఎన్నికల్లో తెదేపా ఓంటరిగా పోటీ చేసి 23 స్థానాల్లో గెలిచింది. భాజపాకు ఒకే ఒక స్థానమూ దక్కలే దు. తెదేపా చేసిన తప్పుడు ప్రచారంఇందుకు ప్రధాన కారణమని కమలనాధుల గట్టి అభిప్రాయం. కేంద్రంలో భాజపామరోసారి అధికారంలోకి వరాగా రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడు. చంద్ర బాబు నాయుడుకు మరోసారి రాజ్యాధికారం దక్కకుండా చేయాలనేది భాజపా ఎత్తుగడగా పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల్లో వైకాపా అధికా రంలోకి రావడంతో భాజపా లక్ష్యం నెరవేరింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos