పూర్తిగా మునిగిన విపణి

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాతో ఆరంభమై నష్టాలతోనే ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో 175 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకున్నా దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాల వల్ల చతికిల బడింది. చివరకు 167 పాయింట్ల నష్టంతో 38,822 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 11,512 వద్ద ముగించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 70.65 గా దాఖలైంది.ఎన్ఎస్ఈలో ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభ పడ్డాయి. వేదాంతా, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, టాటాస్టీల్ షేర్లు నష్ట పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos