కుప్పకూలిన మార్కెట్లు

కుప్పకూలిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం కుప్ప కూలాయి. సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయి 52,792కి పడిపోయింది. నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయి 15,809కి దిగ జారింది. అన్ని సూచీలు నష్టాలు మూట కట్టుకున్నాయి. ఐటీ, లోహాల సూచీలు 4-5 శాతం వరకు నష్ట పోయాయి. ప్రపంచ మార్కెట్లు నష్ట పోవడం మన మార్కెట్ల పై ప్రభావం చూపింది. యూకేలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం కూడా మదుపర్ల ఆందోళనకు కారణమయింది. దీంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ లో సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (3.53%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.82%) మాత్రమే లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-5.78%), విప్రో (-5.75%), ఇన్ఫోసిస్ (-5.28%), టీసీఎస్ (-5.16%), టెక్ మహీంద్రా (-5.07%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos