స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు

స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్ల లాభాలు మంగళవారమూ కొనసాగాయి. మార్కెట్ పొద్దున్నుంచి ఒడుదొడుకుల్లో సాగినా . చివరకు తేరుకుని స్వల్ప నష్టాల పాలైంది. సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడగా నిఫ్టీ స్తబ్దుగా ముగిసింది. విదేశీ సంస్థా గత మదుపర్ల పెట్టు బడులతో మంగళవారం ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ దాదాపు 100 పాయింట్లు లాభ పడింది. నిఫ్టీ 11,900 పైన ట్రేడ్‌ అయ్యింది. ఆ తర్వాత మదు పర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఒక దశలో నష్టాల్లో సాగాయి. చివరి గంటల్లో ఐటీ, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సూచీలు మళ్లీ కోలు కున్నాయి. మంగళ వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 66 పాయింట్లు లాభపడి 39,750 వద్ద, నిఫ్టీ కేవలం 4 పా యింట్ల లాభంతో 11,929 వద్ద స్థిర పడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.70గా దాఖలైంది. ఎన్ఎస్‌ఈలో జీ ఎంట ర్‌టైన్‌మెంట్స్‌, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కోల్ఇం డియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభ పడ్డాయి. భారతీ ఇన్‌ ఫ్రాటెల్‌, బజాజ్ ఆటో, హీరో మోటార్స్‌, గ్రాసిమ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos