నష్టాలతో ట్రేడింగ్ ముగింపు

నష్టాలతో ట్రేడింగ్ ముగింపు

ముంబై : స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు –శుక్రవారం కూడా నష్టాలను మూట గట్టుకున్నాయి. ఈ ఉదయం సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రైవేట్ రంగ బ్యాంకులు, లోహ, మోటారు వాహనాల షేర్ల అమ్మకాల పెరిగిపోవటంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కొంత మేర కొనుగోళ్లు జరగడంతో నష్టాలు కొంచెం తగ్గాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే వేళకు సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయి 39,394కి పడింది. నిఫ్టీ 52 పాయింట్లు పతనమై 11,788కి దిగింది. బజాజ్ ఫైనాన్స్ (1.05%), యాక్సిస్ బ్యాంక్ (0.91%), ఎన్టీపీసీ (0.75%), మారుతి సుజుకి (0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.70%).మేరకు లబ్ధి పొందాయి. యస్ బ్యాంక్ (-3.29%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.85%), టాటా మోటార్స్ (-1.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.79%), ఓఎన్జీసీ (-1.64%) మేరకు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos