ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు

ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ లను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో కూడా నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేశ్ కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 21 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos