మొబైల్ రీఛార్జికి కూడా డబ్బులు లేక టెక్కీలు ఆత్మహత్య..

మొబైల్ రీఛార్జికి కూడా డబ్బులు లేక టెక్కీలు ఆత్మహత్య..

ప్రేమ వివాహం చేసుకొని పరాయి రాష్ట్రంలో ఉంటున్న తెలంగాణకు చెందిన ఇద్దరు టెక్కీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోజెట్ల గోపికృఫ్ణన్ (25), నందిని (25) అనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. గోపికృఫ్ణన్, నందిని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గోపికృఫ్ణన్, నందిని గత ఏడాది పెళ్లి చేసుకుని తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కోడైకెనాల్ లోని అట్టువంపట్టి ప్రాంతంలో కాటేజ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.కరోనా వైరస్ దెబ్బతో గత మార్చి నెల నుంచి గోపికృఫ్ణన్, నందిని ఉద్యోగాలకు వెళ్లకుండా కాటేజ్ కే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో గోపికృఫ్ణన్, నందిని దంపతులు విదేశాల్లో ఉద్యోగాలు సంపాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నందినికి ఇటీవల ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం వచ్చింది.ప్రస్తుతం పని చేస్తున్న చోట గోపికృఫ్ణన్, నందిని ఉద్యోగాలు నిలిపివేశారని తెలిసింది. లాక్ డౌన్ కారణంగా గోపికృఫ్ణన్, నందిని దంపతులు దాచుకున్న డబ్బులు ఖాళీ అయిపోయాయి. కొంతకాలం నుంచి గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆర్థిక సమస్యలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది. కాటేజ్ కే పరిమితం అయిన గోపికృఫ్ణన్, నందిని చుట్టుపక్కల వాళ్లతో అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నారు.కొడైకెనాల్ సొంత ఊరు కాకపోవడంతో ఆర్థిక సహాయం చెయ్యాలని గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఎవ్వరినీ అప్పు అడగలేకపోయారు. ఇదే సమయంలో నందిని ఆస్ట్రేలియా వెళ్లడానికి డబ్బులు అవసరం అయ్యింది. లాక్ డౌన్ కారణంగా గోపికృఫ్ణన్, నందిని తెలంగాణకు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాలపై గోపికృఫ్ణన్, నందిని దంపతులు తీవ్ర డిప్రెషన్ లకు లోనై సతమతం అయ్యారు.గత రెండు రోజుల నుంచి గోపికృఫ్ణన్, నందిని దంపతులు కాటేజ్ నుంచి బయటకురాలేదు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి గోపికృఫ్ణన్, నందిని దంపతులు కాటేజ్ నుంచి ఎందుకు బయటకురావడం లేదు అనే అనుమానంతో వెళ్లి తలుపులు తట్టారు. గోపికృఫ్ణన్, నందిని దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాటేజ్ తలుపులు పగలగొట్టి చూడగా గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.గోపికృఫ్ణన్, నందిని మొబైల్ ఫోన్లలో కరెన్సీ పూర్తిగా ఖాళీ అయ్యిందని పోలీసులు గుర్తించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడం, విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వలనే ఆత్మహత్య చేసుకుంటున్నామని రెండు మాటలు మాత్రమే డెత్ నోట్ రాసి పెట్టి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు. విదేశాలకు వెళ్లడానికి అవకాశం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని కోడైకెనాల్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos