ఎల్జేపీకి ఎదురుదెబ్బ.. 22 మంది సీనియర్‌ నేతల ముకుమ్మడి రాజీనామా

ఎల్జేపీకి ఎదురుదెబ్బ.. 22 మంది సీనియర్‌ నేతల ముకుమ్మడి రాజీనామా

పాట్నా: లోక్సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన శక్తి పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎంపీ టికెట్లను పార్టీ నాయకత్వం అమ్ముకుంటున్నదని ఆరోపించారు. తామంతా ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. కాగా, ఎల్జేపీ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బీహార్ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, రవీంద్ర సింగ్ వంటి కీలక నేతలు ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. చిరాగ్ పాశ్వాన్తోపాటు ఆయన సన్నిహితులు సీట్లను అమ్ముకుంటున్నారని అందులో పేర్కొన్నారు. సమస్తీపుర్, ఖగడియా, వైశాలి లోక్సభ స్థానాల కోసం రూ.కోట్లు తీసుకున్నారన్నారని ఆరోపించారు. బయట నుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీకోసం పనిచేస్తున్న నేతలకు టికెట్లు ఇవ్వాలడి డిమాండ్ చేశారు. ఇక దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి అండగా నిలవాల్సిందేనని, తామంతా విపక్ష కూటమికి మద్దతివ్వబోతున్నాం వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos