కూలిన జీవనాలు

కూలిన జీవనాలు

న్యూ ఢిల్లీ: గత ఏడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు దిగజారి పోయాయని 50 శాతానికిపైగా ప్రజలు భావిస్తున్నట్టు ఒక మాధ్యమ సంస్థ అధ్యయనంలో తేలింది.తాజా బడ్జెట్ నేపథ్యంలో అన్ని వర్గాలకు చెందిన 200మంది అభిప్రాయాల్ని సమీకరించారు. గతే డాది కాలంలో తమ జీవన ప్రమాణాలు క్షీణించాయని 50.7శాతం మంది పేర్కొన్నారు. గత బడ్జెట్ సమయంలో అది 31.3 శాతం. 2019 బడ్జెట్ సమయంలో 26శాతం మంది, 2015, 2016, 2017, 2018 పద్దు సమయాల్లో అవి 38.1శాతం, 39.5శాతం, 32.9శాతం, 33.4 శాతంగా ఉన్నాయి. 17.3శాతం మంది గత ఏడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. మరో 10.7 శాతం మంది తాము ఏ స్థితిలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారని సర్వే పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos