చిట్టి సీతమ్మ చిందులు నెట్టింట్లో వైరల్..

చిట్టి సీతమ్మ చిందులు నెట్టింట్లో వైరల్..

స్మార్ట్‌ఫోన్‌లు,సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా వెంటనే వైరల్ అవుతున్నాయి.ఆకట్టుకునే వీడియోలు,ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో గంటల్లోనూ లక్షల వ్యూస్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి.తాజాగా సీత వేషధారణలో ఉన్న ఓ చిన్నారి సంతోషంతో గంతులు వేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందిఎక్కడ జరిగిందో తెలీదు గానీ ముగ్గురు చిన్నారులకు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వేషాలను వేయించారు. వీరిలో సీతమ్మ ముద్దొచ్చేలా సందడి చేసింది. రామ, లక్ష్మణులుగా చిన్నారులు ఒద్దికగా నిలబడగా సీతమ్మ మాత్రం చిందులేసింది.బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులేసింది.వీడియోలో చిన్నారి హావభావాలకు, డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘మా సీతమ్మ ఎంత క్యూట్గా ఉందో!’ ఎందుకో.. ఈ రోజు సీతమ్మ చాలా సంతోషంగా ఉన్నట్లుంది’, ‘ఈ కాలపు సీతమ్మ చిందేస్తే ఇలాగే ఉంటుంది’ అని కామెంట్లు పెడుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos