విద్యుత్ దీపాలు ఆర్పకుండానే కొవ్వొత్తులు వెలిగించాలి

విద్యుత్ దీపాలు ఆర్పకుండానే కొవ్వొత్తులు వెలిగించాలి

ముంబై: విద్యుత్ దీపాలు ఆర్పకుండానే ఆదివారం రాత్రి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని నిపుణులు సూచించారు. ప్రధాని మోదీ చెప్పినట్లు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు ఆర్పితే విద్యుత్ గ్రిడ్ కూలి పోయి అత్యవసర సేవలకు విఘాతం కలుగుతుందని విద్యుత్ నిపుణులు, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ హెచ్చరించారు. ‘మొత్తం విద్యుత్ దీపాల్ని ఆర్పితే చేస్తే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందరూ దీపాలు ఒకేసారి ఆఫ్ చేస్తే విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. విద్యుత్ వినియోగం ఒకేసారి పెరిగిపోయినా, లేదా బాగా తగ్గిపోయినా గ్రిడ్ ఆగిపోతుంది. విద్యుత్ వినియోగంలో 40 శాతం ఒకేసారి తగ్గిపోతే గ్రిడ్ కుప్పకూలడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దీనిపై తాము చర్చలు జరిపామని ఏపీ విద్యుత్ ఇంజనీర్ల సంఘం నేత వేదవ్యాస్ చెప్పారు. కూలిన గ్రిడ్ పునరుద్ధరణకు కొన్నివారాల సమయం పడుతుందని నితిన్ రౌత్ తెలిపారు. ‘లాక్డౌన్ వల్ల 23,000 మెగావాట్ల డిమాండ్ కాస్త 13,000 మెగావాట్ల పడింది. కర్మాగారాలు పని చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఒక్కసారిగా లైట్లు స్విచ్ఛాఫ్ చేస్తే ప్రమాదం. కరోనా విజృంభిస్తోన్న దశలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగడం చాలా ముఖ్యం’ అని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos