మరోసారి అబాసు పాలైన అమితాబ్

మరోసారి అబాసు పాలైన అమితాబ్

ముంబై: నకిలీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఎక్కించిన నటుడు అమితాబ్ బచ్చన్పై నెటిజన్లు మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో 9 నిమిషాల పాటు దీపాలు వెలగించాలని ప్రజలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. దరిమిలా ఆదివారం మొత్తం చీకటిగా ఉన్న ప్రపంచ పటంలో భార దేశం వెలుగుతూ ఉన్న ఓ ఫేక్ పోస్టును ట్విటర్లో షేర్ చేశారు. ‘ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు భారతదేశం ప్రకాశిస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ ట్వీట్ చేసిన అసలైన పోస్టును అమితాబ్ రీట్వీట్ చేశారు. ‘ప్రపంచం మనల్ని చూస్తోంది, అందులో మనం ఒకరం’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆగ్రహించారు. ‘నకిలీ పోస్టులను పంచుకోవడం ఆపండి సార్.ఇదంతా అబద్ధం బచ్చన్ సార్. మీరు పడుకొండి ఇక ఎదైనా విషయాన్ని పోస్టు చేసే ముందు ఓసారి చెక్ చేసుకోండి ప్లీజ్’ అని చురకలంటించారు. గతంలో కరోనాను ఎదుర్కొవటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలకు మద్దతునిచ్చి అబాసు పాలయ్యారు. హోమియోపతిలోని గోమూత్ర వైద్యం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించి విమర్శల పాలయ్యారు. క చైనా షేర్ చేసిన ఓ వీడియోను బిగ్బీ షేర్ చేసారు. అది ‘అంటువ్యాధుల నివారణలో ప్రపంచాన్ని భారతదేశం నడిపిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ చేసిన ట్వీట్ను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos