అద్భుతాలకు ఆలవాలం..ఇక్కేరి అఘోరేశ్వర ఆలయం..

  • In Tourism
  • December 4, 2019
  • 227 Views
అద్భుతాలకు ఆలవాలం..ఇక్కేరి అఘోరేశ్వర ఆలయం..

కర్ణాటక రాష్ట్రంలో దట్టమైన పశ్చిమ కనుమల ఒడిలో అణువణువు ప్రకృతి అందాలతో నిబిడీకృతమైన ఏడు జిల్లాల సమూహైన మలెనాడు ప్రాంతం పర్యాటక,ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.మలెనాడు ప్రాంతానికి ముఖద్వారంగా నిలిచే శివమొగ్గ జిల్లా ఎన్నో ప్రముఖ పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలకు చిరునామాగా ప్రసిద్ధి చెందింది.అందులో ఒకటి సాగర పట్టణం సమీపంలోనున్న ఇక్కేరి అఘోరేశ్వర దేవాలయం.క్రీ.శ 1560 నుంచి 1640 వరకు ఈ ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలించిన కెలాడి రాజులు ఇక్కేరి గ్రామంలో నిర్మించిన అఘోరేశ్వర ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.

గ్రానైట్ రాళ్లతో నిర్మించిన స్తంబాలు..

ఆలయం గోడలపై అద్భుత శిల్పకళ..

ఆలయంలో అప్పటి రాజుల కళాపోషణ,శిల్పుల నైపుణ్యత ఉట్టిపడేలా ఉన్న శిల్పాలు,ప్రతిమలు తన్మయత్వంలో ముంచెత్తుతాయి.ఆలయంలోని శిల్పకళల్లో చాళుక్యులు,ద్రవిడులు,హొయ్సళ,దక్కన్‌ సుల్తానులు, విజయనగర రాజుల శిల్పశైలి కనిపిస్తుంది.ఆయలంలో పురాతన కన్నడ లిపిలో చెక్కిన శాసనాలు,ఏనుగులు,నృత్యశిల్పాలు ఇటువంటి ఎన్నో అద్భుతాలు దర్శనమిస్తాయి. పచ్చటి పచ్చిక మధ్య గ్రానైట్‌ రాళ్లతో అత్యద్భుతంగా తూర్పు,పడమర,ఉత్తర దిక్కుల్లో మార్గాలతో నిర్మించిన ఆలయం సరికొత్త రూపురేఖలతో కనిపిస్తుంది.ఆలయం లోపలికి ప్రవేశించగానే కనిపించే ఇస్లామిక్‌ శిల్పకళతో దేవాలయం ఇస్లామిక్‌ సుల్తానుల దాడిలో ధ్వంసమైందని తెలుస్తోంది.

ఇస్లామిక్ సుల్తానుల దాడిలో ధ్వంసన శిల్పాలు..

స్తంబాలపై చెక్కిన శిల్పాలు..

కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి. ప్రాంతాన్ని పరిపాలించిన కెలాడి రాజులు విజయనగర సామ్రాజ్యానికి సామంతులు కావడంతో విజయనగర సామ్రాజ్య పరిపాలన తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి.విజయనగర రాజులకు సామంత రాజులు కావడంతో కెలాడి రాజులు సైతం బంగారు నాణేలు,అర్ధచంద్రాకార,పూర్తి చంద్రాకార బంగారు నాణేలు,వజ్రవైఢూర్యాలు చలామణిలో ఉండేవి.కెలాడి రాజ్యంలో బంగారం చాలా విరివిగా లభించేదని స్థానిక చరిత్ర.

కెలాడి రాజుల కాలం నాటి బంగారు నాణేలు..

అఘోరేశ్వర దేవాలయానికి మరో ప్రత్యేకత ఉంది.దేశంలోని అన్ని దేవాలయాల ముఖద్వారం తూర్పు దిక్కుకు ఉండగా అఘోరేశ్వర దేవాలయం ముఖద్వారం మాత్రం ఉత్తర దిక్కుకు ఉంటుంది.ఆలయంలో అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులతో 32 రకరకాల ఆయుధాలతో దర్శనమిస్తుంది.ఒక్కేరిలోని మరో ప్రధాన ఆకర్షణ ఏడు పీఠాలు.ఏడు మంది దేవతా మూర్తుల కోసం ఏడు పీఠాలు నిర్మించారు.ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారు.ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటినిశక్తి పీఠంగా పిలువబడుతున్నారు.ఉత్తర ద్వారం వద్ద రెండు ఏనుగులు నిర్మాణాలు ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ.ఈ దేవాలయాన్ని దర్శించే పర్యాటకులు భైరవ, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య మరియు గణేష బొమ్మలను కూడా చూడవచ్చు.

ఉత్తర ద్వారం వద్ద ఏనుగుల నిర్మాణాలు

ఆలయం పైభాగంలో చెక్కిన కమలాకార నిర్మాణం..


ఎలా చేరుకోవాలి :
బస్సు లేదా రైలు మార్గం ద్వారా బెంగళూరు నుంచి నేరుగా శివమొగ్గకు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో సాగర పట్టణానికి చేరుకోవాలి.అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కేరికి చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos