అరుదైన నల్ల చిరుతలు

అరుదైన నల్ల చిరుతలు

భువనేశ్వర్‌:ఒడిశాలో రెండు అరుదైన నల్ల చిరుతలను గుర్తించారు. ఈ చిరుతల చిత్రాలను ఆ రాష్ట్ర పీసీసీఎఫ్‌ సుశాంత నందా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అయితే చిరుతల భద్రత దృష్ట్యా అవి కనిపించిన ప్రదేశం వివరాలను ఆయన వెల్లడించలేదు. పులుల గణన సందర్భంగా తమ రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించే, ఊహించని వన్యప్రాణులు ఉన్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు.‘ఒక ఆడ, ఒక మగ నల్ల చిరుతను రెండు విభిన్న ప్రదేశాల్లో గుర్తించాం. ఇది అసహజమేమీ కాదు. గతంలోనూ ఇలాంటి చిరుతలు రెండు రాష్ట్రంలో కనిపించాయి’ అని ఆయన తెలిపారు. జన్యు ఉత్పరివర్తనాల వల్ల చిరుతలు నల్ల రంగుతో జన్మిస్తాయని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos