మీరూ మీరూ చూసుకోండి

మీరూ మీరూ చూసుకోండి

న్యూఢిల్లీ: తీస్ హజారీ న్యాయస్థానం ఆవరణలో జరిగిన ఘర్షణలపై పోలీసులతో చర్చించి వివాదాన్ని పరిష్కరించు కోవాలని న్యాయవాదుల్ని ఉన్నత న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసుల నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘రాజీకోసం మీ కార్యాలయాలను ఉపయో గిం చుకోండి. మళ్లీ ఇలాంటి పిటిషన్లు వేయకండ’ని పేర్కొంది. పోలీసులు ఆందోళనకు దిగటం నిబంధనలకు విరుద్ధం. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించాల’ని కోరారు. సామాజిక మాధ్యమాల్లో పలువురు ఐఏఎస్ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులు రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసారనీ ఆరోపించారు. ఆందోళనకు దిగిన పోలీసుల్ని సేవల నుంచి తొలగించాల’ని కోరారు. రెండు వర్గాల మధ్య సంభవించిన ఘర్షణల్లో ఎనిమిది మంది న్యాయవాదులు, ఇరవై మంది పోలీసులు గాయ పడ్డారు. తీస్ హజారీ ఘటన తర్వాత కర్కాడుమా న్యాయస్థానంలో కూడా పోలీస్ జవానుపై న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. సాకేత్ కోర్టు వద్ద విధులు నిర్వహిస్తున్న మరో పోలీస్ అధికారి జ్యోతి పైనా న్యాయవాదులు దాడి చేసిన వీడియోలు సంచలన మ య్యాయి. దరిమిలా ఢిల్లీ పోలీసులు, వారి కుటుంబాలు పోలీస్ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీ సులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదంపై ప్రచార సాధనాల్లో ప్రసారం కాకుండా నిషేధించాలనీ ఉన్నత న్యాయ స్థానంలో శుక్ర వారం మరో వ్యాజ్యం దాఖలైంది. దీన్ని అత్యవసరంగా విచారించాలని కక్షిదారు చేసినవినతిని ధర్మాసనం తోసి పుచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos