‘బాధితురాలి’నే అరెస్టు చేసిన ఖాకీలు

‘బాధితురాలి’నే అరెస్టు చేసిన ఖాకీలు

లక్నో: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక వేదింపుల కేసు బుధవారం కొత్త మలుపు తిరిగింది. ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణల్ని చేసిన న్యాయ విద్యార్థినిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విచారణ కోసం మంగళవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె డబ్బులు వసూలు చేసేందుకే బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు పై ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘పోలీసులు ఆమెను బలవంతంగా ఈడ్చు కుంటూ వెళ్లార’ని విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. బ్లాక్ మెయిల్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయా లని ఆమె న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఇది కోర్టులో గురువారం విచారణకు రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos