స్లిప్పులో రోహిత్ ముసిముసి నవ్వులు

స్లిప్పులో రోహిత్ ముసిముసి నవ్వులు

నేపియర్‌: టీమిండియా- న్యూజిలాండ్‌ జట్ల మధ్య నేపియర్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ట్రెంట్‌ బౌల్ట్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా వికెట్‌ కీపర్‌ పక్కనే ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ నవ్వాపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. మ్యాచ్‌లో భాగంగా బౌల్ట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 37వ ఓవర్లో స్పిన్నర్‌ చాహల్‌ బౌలింగ్‌ చేశాడు. ఈ క్రమంలో చాహల్‌ బౌలింగ్‌కు అనుగుణంగా బౌల్ట్‌ కూడా సన్నద్ధమై కిందికి వంగాడు. అయితే చివరి నిమిషంలో చాహల్‌‌ వేసిన బంతికి బౌల్ట్‌ కాస్త గందరగోళానికి గురయ్యాడు. ఈ తతంగాన్నంతా చూసిన రోహిత్‌ నవ్వాపుకోలేకపోయాడు. అయితే బౌల్ట్‌ సైతం కోపగించుకోకుండా క్రీడా స్ఫూర్తితో రోహిత్‌ వైపు చూసి నవ్వుకుని బ్యాటింగ్‌ కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. టీమిండియా-కివీస్‌ జట్ల మధ్య క్రీడాస్ఫూర్తి బావుందంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos