లాలూ ప్రసాద్​కు బెయిల్​… అయినా జైలులోనే

లాలూ ప్రసాద్​కు బెయిల్​… అయినా జైలులోనే

రాంచి : దాణా కొనుగోలులో అవినీతికి పాల్పడిన నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు శుక్ర వారం ఇక్కడి ఉన్నత న్యాయ స్థానం చాయీబాసా ట్రెజరీ కేసులో బెయిల్ మంజూరు చేసింది. లభించింది. దమ్కా కోశాగారం కేసు ఇంకా పెండింగ్లో ఉన్నందున లాలూ ఇంకా జైలులోనే ఉండనున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా పని చేసినపుడు లాలూ ప్రసాద్ యాదవ్ 1992-93 లో చాయీబాసా కోశాగారం నుంచి రూ.33.67 కోట్లు అక్రమంగా పొందారనే కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 2017 నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ చెరసాల్లోనే ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో 2017లో ఆయనకు ఏడేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం అనారోగ్యం పాలైన లాలూ రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos