రాహుల్ మంచి పోరాట యోధుడు

రాహుల్ మంచి పోరాట యోధుడు

హైదరాబాద్: ‘రాహుల్ మంచి పోరాట యోధుడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇది తేలిపోయింది. ఏఐసీసీ అధ్యక్షుడుగా ఆయనే కొన సాగాలని’ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కుంతియా అన్నారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పురపాలిన ఎన్నికల్లో వెనుక బడిన వర్గాల రిజర్వేషన్లు 34 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహ రచనకు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సమితిని నియమిస్తామన్నారు. జులై మొదటివారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సమావేశం జరుగుతుందని తెలిపారు. నూతన ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధినేత నియామకం గురించి ఇంకా చర్చించ లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డే అధినేతగా చీఫ్గా కొనసాగుతారని స్పష్టీకరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos