మళ్లీ ఏడ్చిన కుమారస్వామి..

మళ్లీ ఏడ్చిన కుమారస్వామి..

కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగలేమంటారు.. ఇప్పుడు కర్ణాటక సీఎం కుమారస్వామిదీ అదే పరిస్థితి. ఆయన భావోద్వేగాలను అణుచుకోలేకపోతున్నారు. సీఎం అన్న సోయి మరిచి చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. పొత్తుల ఎత్తుల్లో లక్కీగా సీఎం అయిన కుమారస్వామిని మిత్రపక్షం కాంగ్రెస్ చెడుగుడు ఆడుకుంటోంది. వాళ్ల కోరికలు తీర్చలేక.. కుర్చీని కాపాడుకోలేక కుమారస్వామి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. నెలకిందట ఇలాగే ఏడ్చేసిన కుమారస్వామి.. తాజాగా మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన ఈసారి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో తెలుసా.?కుమారస్వామిని మిత్రపక్షం కాంగ్రెస్ లెక్క చేయడం లేదన్న బాధతో ఆయన ఏడ్చేశాడట.. జేడీఎస్ నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారట..జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చింది.సీఎం కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని.. వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని కుమారస్వామి భావోద్వేగానికి గురై జేడీఎస్ ఎమ్మెల్యేల ముందర కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారస్వామి ఏడుపు చూసి కాంగ్రెస్ పై వేచి చూద్దామని.. తీరు మారకపోతే ఆలోచిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత – మాజీ ప్రధాని దేవెగౌడ సూచించినట్టు సమాచారం.
కుమారస్వామి ప్రజలతో బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు తనది మైనారిటీ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నానంటూ వరుసుగా కన్నీల్లు పెట్టుకుంటున్నారు. నెల కిందటే ఏడ్చేశారు. ఇప్పుడు మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడంపై నెటిజన్లు కన్నడ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos