తను నిజంగా సుకుమారుడే

తను నిజంగా సుకుమారుడే

కాకినాడ : సినీ దర్శకుడు సుకుమార్ మరోసారి తన వితరణ శీలతను చాటుకున్నాడు. కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలకు రూ. పది లక్షలు విరాళమిచ్చిన ఆయన తాజాగా తన స్వగ్రామం మలికిపురం మండలం మట్టపర్రుకూ రూ. ఐదు లక్షల సాయం చేసారు. తమ గ్రామంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. వెయ్యి చొప్పున తన కుటుంబ సభ్యుల ద్వారా పంపిణీ చేశారు. ‘మిత్రులకే కాదు, శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రావొద్దని కోరుకుంటున్నాను. మా గ్రామంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. తనని చూసి మరి కొందరు ముందుకు వస్తారని, కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెబుతున్నాను’ అని సుకుమార్ పేర్కొన్నారు. తమ కష్టాలను గమనించి చేయూతనిచ్చిన సుకుమార్ గారికి రుణపడి ఉంటామని గ్రామస్తులు ఆయన్ను ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos