ఆంక్షలతో కూడిన న్యాయ సాయం

ఆంక్షలతో కూడిన న్యాయ సాయం

ఇస్లామాబాద్: భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో భారత్ రాయబార కార్యాలయం నుంచి ఆవరోధాల్లేని న్యాయ సహాయాన్ని అందించేందుకు పాక్ గురు వారం నిరాకరించింది. గతంలో పాక్ ఇచ్చిన నిబంధనలతో కూడిన అనుమతి పై భారత్ ఆక్షేపించింది. ఆయన్ను కలుసుకోవటానికి ఎటువంటి ఆటంకం, పర్యవేక్షణ లేని వాతావరణాన్ని కల్పించాలని పాక్ను కోరింది. గత నెల్లో ఐసీజే ఇచ్చిన ఆదేశాల మేరకు జాదవ్ను కలవడానికి పాక్ అనుమతించింది. అయితే పాక్ చట్టాల ప్రకారం మూడు నిబంధనలు పెట్టింది. భేటీ అయినపుడు పాకిస్థాన్ అధికారి హాజరు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు వాటిలో ముఖ్యమైనవి. ఇందుకు భారత్ ఆక్షేపించింది. వియన్నా ఒప్పందం ప్రకారం విదేశాల్లో బంధీలుగా ఉన్న వారిని ఆయా దేశాల అధికారులు ఏ ఆటంకం లేకుండా కలుసుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos