కేటీఆర్‌ మెచ్చిన కేజీఎఫ్‌…

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాజకీయాల్లో ఎంత తీరికలేకుండా ఉన్న అప్పుడప్పుడు సినిమాలు,క్రికెట్‌ చూస్తూ తన అభిరుచి,అభిప్రాయాలు ప్రజలతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలో గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన కేజీఎఫ్‌ చిత్రాన్ని చూసిన కేటీఆర్‌ చిత్రంపై ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించారు.కేజీఎఫ్‌ చిత్రం తమకు ఎంత నచ్చిందో వివరిస్తూ ట్వీట్ చేశారు.‘కాస్త లేటైనా ఎట్టకేలకు ‘కెజిఎఫ్’ చిత్రం చూశాను. వావ్ ఏం మూవీ అనేలా ఉంది. టెక్నికల్‌గా బ్రిలియంట్, కూల్ అండ్ ఇంటెన్స్ మూవీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్. కన్నడ రాక్ స్టార్ యష్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో నిర్మితమైన కేజీఎఫ్‌ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి కన్నడ చిత్రంగా రికార్డులు నెలకొల్పింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos