బీజేపీకి తెలంగాణలో పుట్టగతులుండవు

బాన్సువాడ ; తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన బీజేపీకి తెలంగాణలో పుట్టగతులుండవు, తెలంగాణ పై వివక్ష ఎందుకని మంత్రి కేటీఆర్ బుధవారం బీజేపీపై మండి పడ్డారు. ఇక్కడ ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియాలో తెలంగాణపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీకి 25 శాతం నిధులు కేంద్రం తగ్గించింది. జీవితాలు మార్చమంటే జీవిత భీమాను అమ్మేశారు. కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ముందా . కర్ణాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా తెలంగాణలో ప్రాజెక్టులకు మాత్రం ఆ హోదా ఇవ్వలేదు.యూపీకే ప్రధానిగా మోడీ వ్యవహరిస్తున్నారు. దేశంలో 157 వైద్య కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసింది. మతం, ధర్మం కోసమని మాట్లాడుతారు, దేశం కోసం ఏం చేశారో కూడా చెప్పరని బీజేపీను ఎండ గట్టారు. దేశంలో 157 వైద్య కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ధర్మం కోసమని మాట్లాడుతారు, కానీ దేశం కోసం ఏం చేశారో కూడా చెప్పరని ఆయన బీజేపీ తీరును ఎండగట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం కొనసాగుతుంది. రెండు పార్టీలు అవకాశం దొరికితే పరస్పరం విమర్శలు గుప్పించుకొంటున్నారు. రాష్ట్రానికే కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. కేంద్రం ప్రజల కోసం ఏం చేసిందని కూడా ప్రశ్నిస్తోంది. ఏడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని చెప్పేందుకు తాము సిద్దమని కూడా బీజేపీ నేతలు ప్రకటించారు.

తాజా సమాచారం