యుద్ధాల పేరిట ఓట్లడిగే మోదీ

యుద్ధాల పేరిట ఓట్లడిగే మోదీ

బెంగళూరు: బాలాకోట్ దాడుల పేరు చెప్పి ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ. కుమార స్వామి విమర్శించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. పాకిస్థాన్ సరిహద్దులకు తానే వెళ్లి అక్కడి ఉగ్రవాదుల శిబిరాలపై బాంబులు జార విడిచినట్లు ప్రధాని మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమ ర్శించారు. ‘దేశాన్ని పలువురు ప్రధానులు గతంలో పాలించారు. ఇండియా-పాక్ యుద్ధం కూడా పలుసార్లు జరిగింది. అయితే ఏ ఒక్క ప్రధాని కూడా నాటి యుద్ధాల నుంచి వ్యక్తి గత , రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు. సొంత ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకోలేద’ని మోదీపై మండిపడ్డారు. ‘ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు. మా కుటుంబ సభ్యులను పోటీ చేయమని అడిగారు. . ఇందులో ఆనువంశిక పాలన అనే ప్రసక్తే లేదు. ప్రజలు తమ నాయకత్వాన్ని కోరుకుంటే తమను ఆదరిస్తారని, లేదంటే తిరస్కరిస్తారు. అది కర్ణాటక ప్రజల ఇష్టమ’ని పేర్కొన్నారు. ‘స్థానిక మీడియా మిత్రులు గత నాలుగు నెలలుగా మండ్య లోక్‌సభ గురించి నిరంతరం ప్రస్తావించి, దేశంలో అతిపెద్ద నేతగా ఆమె (సుమలతా అంబరీష్) అవతరించబోతున్నారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నార’ని విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత దేవెగౌడ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారని అభిప్రాయపడ్డారు. ‘వచ్చేసారి భాజపా ప్రభుత్వం ఉండదు.ప్రాంతీయ పార్టీలతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరికీ తగిన సూచనలు, సలహాలు ఇస్తూ జాతీయ రాజకీయాల్లో దేవెగౌడ కీలక భూమిక పోషిస్తున్నార’ని కుమారస్వామి తెలిపారు. ఆ ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని, తాను మాత్రం కర్ణాటకలోనే ఉంటానన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos