కృష్ణాలో తగ్గిన వరద ఉధృతి

కృష్ణాలో తగ్గిన వరద ఉధృతి

నల్గొండ : కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాల్లో కొన్ని గేట్లను మూసివేశారు. నాగార్జున సాగర్‌లో 12 గేట్లను మూసివేసి, మిగిలిన 14 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 4.60 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2.55 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. గరిష్టం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 303.94 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలోకి కూడా వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అయిదు గేట్లను మూసివేశారు. ఇక్కడ ఇన్‌ఫ్లో 3.87 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2.47 క్యూసెక్కులుగా నమోదవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos