కోవింద్‌ నోట పాత పాటే

కోవింద్‌ నోట పాత పాటే

న్యూ ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం చేసిన ప్రసంగం పాత పాటేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం ఎద్దేవా చేసారు. ‘కొత్త సంవత్సరంలో వెలువడిన ప్రభుత్వ తొలి విధాన ప్రకటన-రాష్ట్రపతి ప్రసంగం. పతనమైన అర్థిక వ్యవస్థను పైకిలేపే పరిష్కారం కోసం ప్రభుత్వం ఏమైనా సంకేతాలు ఇస్తుం దా అని చూశాను. అయ్యో… అలాంటిదేమీ కనిపించలేదు. పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న పెట్టుబడులు తదితర సమ స్య లపై ప్రభుత్వానికి ఎలాంటి పరిష్కారం తోచడం లేదని అనిపిస్తోంది. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్క మాట కూడా చెప్పక పోవడం బాధాకరం. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రత్యేకించి సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామిక రంగం కుదేలైనా కనీసం ప్రస్తావించలేద’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos