ఆ షోలో ప్రభాస్!

  • In Film
  • June 29, 2019
  • 127 Views
ఆ షోలో ప్రభాస్!

తెరపై హీరోయిన్లతో రొమాన్స్‌లు చేస్తూ ప్రతినాయకులతో భీకరంగా పోరాడే డార్లింగ్‌ ప్రభాస్‌ రియల్‌లైప్‌లో మాత్రం గొడవలు,హీరోయిన్లు ముఖ్యంగా మీడియాకు నాలుగు అడుగుల దూరంలోనే ఉంటాడు.ఇక టీవీ షోలు అంటే చాలా దూరంగా ఉంటాడు.అయినప్పకీ ఛానెళ్లు మాత్రం ప్రభాస్‌తో ఇంటర్‌వ్యూ చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతేనే ఉంటాయి.కారణం ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడమే.ఈ క్రమంలో అన్ని భాషల్లో విజయవంతంగా దూసుకుపోతున్న జీ ఛానెల్‌ ప్రభాస్‌తో షో చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.గతంలో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే కార్యక్రమంతో పలువురు సినీ ప్రముఖులతో యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు చేసిన షోకు మంచి ఆదరణ దక్కింది.త్వరలో ఈ షో రెండవ సీజన్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభాస్‌ను ఇంటర్‌వ్యూ చేయడానికి ప్రదీప్‌ సిద్ధమతున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్‌ను ఈ షోలో పాల్గొనేలా ఒప్పించడానికి ఛానెల్‌ యాజమాన్యం,షో నిర్వాహకులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.మరోవైపు ప్రభాస్‌ కూడా షోలో పాల్గొనడానికి అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుసస్తోంది.అందుకు ప్రధాన కారణం ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా శాటిలైట్ హక్కులను జీతెలుగు వారే సొంతం చేసుకున్నారు. ఈ హక్కుల కోసం సదరు ఛానెల్ రూ.50 కోట్ల రూపాయలను చెల్లించింది.ఆ చనువుతోనే ఈ షోలో కనిపించడానికి ప్రభాస్ ని ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ‘సాహో’కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఈ షో నుండే ప్రారంభమవుతాయని.. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ షోలో ప్రభాస్ బయటపెడతాడని టాక్.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos