కేంద్రం నిర్ణయమే శిరోధార్యం

కేంద్రం నిర్ణయమే శిరోధార్యం

దిల్లీ : ప్రపంచ కప్పు లీగ్ మ్యాచులో పాకిస్తాన్తో ఆడాలా, వద్దా అనే విషయమై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. పుల్వమాలో భారత జవాన్లపై ఉగ్ర దాడి నేపథ్యంలో ఇంగ్లండ్లో జరుగనున్న ప్రపంచ కప్పు పోటీల్లో పాకిస్తాన్తో భారత జట్టు ఆడరాదని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కోహ్లీ స్పందించాడు. పుల్వమా దాడిలో అసువులు బాసిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, జట్టు కెప్టెన్గా భారతీయుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత జట్టు కెప్టెన్గా తనపు ఉంటుందన్నాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామన్నాడు. మరో వైపు ప్రపంచ కప్పులో భారత జట్టు పాకిస్తాన్తో ఆడాలా, వద్దా అనే విషయమై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తాం సరే, ఒక వేళ ఫైనల్స్లో భారత, పాక్లు తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది కొందరి ప్రశ్న. అందుకే మ్యాచ్ను బహిష్కరించడం కన్నా, ఆడి పాక్ను ఓడిస్తే మంచిదని సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos