వెంటిలేటర్ పై కోడెల

వెంటిలేటర్ పై  కోడెల

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాద రావు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆయన బంధువు ఒకరు శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. గుండె పోటుతో ఆయన శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తెదేపా నేతలు నక్కా ఆనంద బాబు, జీవీ ఆంజనేయులు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసారు. కోడెల అనారోగ్యానికి వైకాపా ప్రభుత్వ ఒత్తిళ్లే కారణమని నక్కా ఆనందబాబు ఆరోపించారు. కోడెల కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos