కోర్టు ధిక్కారకేసు దాఖలు చేయండి

న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా కోర్టు ధిక్కార దాఖలుకు తన అనుమతి అవసరం లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సోమవారం న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయకు రాసిన లేఖలో తేట తెల్లం చేసారు. జగన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టీకరించారు. ‘జగన్ పై 31 కేసులు ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తర్వాత జగన్ ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే అన్ని విషయాలు సీజేఐకి తెలుసు. అందుకే కోర్టు ధిక్కారం కింద కేసు నమోదుకు నేను ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos