దేశ వ్యాప్తంగా ర్యాలీలు.. అన్నదాతల కొత్త వ్యూహం

దేశ వ్యాప్తంగా ర్యాలీలు.. అన్నదాతల కొత్త వ్యూహం

న్యూఢిల్లీ : నల్లచట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న పోరాటం 83వ రోజుకి చేరుకుంది. అయితే సరిహద్దుల్లో రైతులు తక్కువగా వున్నా రంటూ వస్తోన్న వార్తలపై రైతు నేతలు స్పందించారు. ఇది సుదీర్ఘంగా కొనసాగే పోరాటమని, సరిహద్దుల్లో రైతులు తక్కువ మంది ఉండటం కూడా వ్యూహంలో ఒక భాగమేనని అన్నారు. ఇది ఆందోళనను వ్యాప్తి చేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆందోళనకు మద్దతుగా రాష్ట్రాలలో భారీ ర్యాలీలు నిర్వహించడంపై దృష్టి పెట్టా మని అన్నారు. రైతు నేత రాకేష్ తికాయిత్ దేశవ్యాప్తంగా మహాపంచాయత్లను నిర్వహిస్తున్నారని.. రానున్న పదిరోజుల్లో హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్లలో జరగనున్న సమావేశాలకు ఆయన హాజరవుతారని చెప్పారు. ఈ సరిహద్దుల్లో పది లక్షల మంది గుమిగూడినంత మాత్రాన ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా, అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు జరుగుతున్నాయని.. ప్రజలు కూడా భాగస్వామ్యమవుతున్నారని తికాయిత్ అన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి దృష్ట్యా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టామని.. అయితే రైతు నేతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారని ఘాజిపూర నిరసన కమిటీ ప్రతినిధి జగ్తార్ సింగ్ బజ్వా అన్నారు. రైతు నేతలు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. నిరసన ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరుకోవాలని, ఇందులో భాగంగానే.. ప్రతి రాష్ట్రంలోనూ మహా పంచా యత్లు నిర్వహిస్తున్నామని అన్నారు. యువతను కూడా ఆందోళనలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నామని.. సరిహద్దుల్లో మాత్రమే కాదు.. రైతులు తమ పొలంలో పనిచేస్తూ చేపట్టే అందోళనలు కూడా పోరాటంలో భాగమేనని బజ్వా అన్నారు. అవసరమనుకుంటే ఒక్కరోజులో లక్షమంది రైతులు సరిహద్దుకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యకర్తలు కూడా ఆందోళనల్లో పాల్గొనడంతో వికేంద్రీకరణ జరుగుతోందని.. ఇది పోరాటంలో ముఖ్యమైన దశ అని, పంజాబ్, హర్యానాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, కార్యకర్త సందీప్ పాండే అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos