ఓడి గెలిచిన కిషన్ రెడ్డి…తెలుగు రాష్ట్రాలకు ఏకైక ప్రాతినిధ్యం

ఓడి గెలిచిన కిషన్ రెడ్డి…తెలుగు రాష్ట్రాలకు ఏకైక ప్రాతినిధ్యం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన గంగాపురం కిషన్‌ రెడ్డి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పిలుపుతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఏడాది ఆఖరులో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయనను అదృష్టం వేరే రూపంలో వరించింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తొలిసారి లోక్‌సభలో అడుగిడుతారని అనుకుంటుండగానే, ఆయనకు ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో కూడా స్థానం లభించింది. 1960లో రంగారెడ్డి జిల్లాలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 1980లో భాజపా ఆవిర్భవించాక, ఆ పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా చేరారు. యువ మోర్చాలో వివిధ పదవులు చేపట్టిన అనంతరం 2002లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. 2004లో హిమాయత్‌ నగర్‌ నుంచి పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లలో అంబర్‌పేట నుంచి ఎన్నికయ్యారు. తద్వారా హ్యాట్రిక్‌ సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో 1,116 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాలుగు నెలల అనంతరం సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 62,114 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos