ప్రజల ఆస్తులు అంబాని, అదానీలకా

ప్రజల ఆస్తులు అంబాని, అదానీలకా

విశాఖ పట్టణం : విశాఖ ఉక్కు కర్మాగారం , ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల సొమ్ముతో నిర్మించినవే. వాటిని కేంద్రం అయిన కాటికి అమ్మేయకుండా ఐటి ప్రొఫెషనల్ ఉద్యోగుల జాతీయ కార్యదర్శి కిరణ్ చంద్ర పిలుపునిచ్చారు. ఇక్కడి నిరాహారదీక్ష శిబిరంలో ఆయన ప్రసంగించారు. బుధవారంతో ఆందోళన ఆరో రోజుకు చేరింది. ‘ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఉక్కు కర్మాగారానికి రైతులు తమ భూములను తక్కువ ధరకు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రజల ఆస్తులను అంబాని, అదానీలకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుంది. ఉక్కు పరిశ్రమ వల్ల ముఠా కలాసీలకు, బిల్డింగ్ కార్మికులకు ఉపాధి పనులు దొరుకుతున్నాయి. వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే సాధ్యం. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుకొమ్మలు. ఈ సంస్థలను కాపాడుకోవాలి. ఇదే అంశాన్ని ఐటి సెక్టార్ ఉద్యోగుల్లో కూడా విస్తఅతంగా ప్రచారం చేస్తామన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos