కిమ్‌తో భేటీకి ట్రంప్ ఆసక్తి

కిమ్‌తో భేటీకి  ట్రంప్ ఆసక్తి

ఒసాకా: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో మూడోసారి మంతనాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. కేవలం మర్యాదపూర్వకంగా కలవాలనకుంటున్నానని ఆయన ట్విటర్ ద్వారా శనివారం తన మనోగతాన్ని వెల్లడించారు. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఉభయ కొరియా దేశాల సరిహద్దులో కిమ్ను కలవదలచినట్లు ట్రంప్ చెప్పారు. ఇది వరకూ రెండుసార్లు చర్చలు విఫలం కావటంతో రెండు దేశాలూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ దశలో ట్రంప్ స్వయంగా కిమ్ను కలవదలచటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ట్రంప్ ఆహ్వానం ఆసక్తిగా ఉంది. అమెరికా నుంచి ఇంకా అధికారిక సమాచారం లేద’ ఉత్తర కొరియా తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos