ఆసక్తికరంగా కిల్లర్‌ ట్రైలర్‌..

  • In Film
  • March 27, 2019
  • 131 Views
ఆసక్తికరంగా కిల్లర్‌ ట్రైలర్‌..

సాధారణంగా తమిళ సినిమాలు సహజత్వానికి కొంచెం దగ్గరగా ఉంటాయి.ఈ కారణంగానే తమిళ చిత్రాలు తమిళంతో పాటు తెలుగు,హిందీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుంటాయి.ఇక క్రైమ్‌ థ్రిల్లర్‌,సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలైతే మరింత ఆసక్తికరంగా తీయండలో తమిళ దర్శకులు దిట్టలు.నకిలీ,డాక్టర్‌ సలీమ్‌,బిచ్చగాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన విజయ్‌ ఆంటోని కొత్త చిత్రం కిల్లర్‌ ట్రైలర్‌ విడుదలైంది.హత్య నేపథ్యంలో సాగే కిల్లర్‌ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.ట్రైలర్‌ ఆరంభంలోనే బీచ్‌లో గుర్తు పట్టలేని విధంగా హత్య చేసిన వ్యక్తి మృతదేహాన్ని చూపించి హత్యను చేధించే అధికారిగా యాక్షన్‌ కింగ్‌ను అర్జున్‌ను చూపించారు.కట్‌ చేస్తే ఓ గదిలో సిగరెటె తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్న విజయ్‌ ఆంటోనిని చూపించారు.సినిమా టీజర్ రియలిస్టిక్ గా కొంచెం తమిళ స్టైల్లో ఉంది.సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ పర్ఫెక్ట్. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలానే ఉంది.  విజయ్ అంటోనీతో పాటుగా అర్జున్ కూడా కీలక పాత్ర పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచేదే. ఆలస్యం ఎందుకు.. ‘కిల్లర్’ ను చూసేయండి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos