పాక్‌లో హిందూ యువతుల అపహరణలు

పాక్‌లో  హిందూ యువతుల అపహరణలు

ఇస్లామా బాద్: పాకిస్థాన్లో హిందూ యువతుల్ని అపహరి స్తున్నారని పాకిస్థాన్ ముస్లిం ప్రముఖుడు, నవాజ్ పార్టీ నాయకుడు ఖేల్ దాస్ కోహిస్తానీ చేసిన ఆరోపణ కలకలాన్ని సృష్టించింది. గత నాలుగు మాసాల వ్యవధిలో ముప్పయి మంది హిందూ అమ్మాయిలు కనిపించకుండా పోయారని పార్ల మెంటులో ఆరోపించారు. హిందువులే లక్ష్యంగా దుండగులు దుశ్చర్యకు పాల్పడుతు న్నారని దుయ్యబట్టారు. సింధు ప్రాంతం లర్కానాలో ఇటీవల ఒక హిందూ వైద్య విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు విశ్వ విద్యాలయం ప్రకటించింది. ఆమె తల్లి దండ్రులు మాత్రం హత్యని ఆరోపించారు. దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న దశలో హిందూ మహిళల పట్ల ఎన్నాళ్లు ఈ అకృ త్యాలు కొనసాగిస్తారని ఆయన పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశారు.సింధు ప్రావిన్సులోని గోట్కీ, ఉమర్కోట్ ప్రాంతంలోనే ఎందుకు ఇలాంటి ఘట నలు జరుగుతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. బాధ్యుల్ని అరెస్టు చేయక పోతే మొత్తం సింధు ప్రాంతానికి ఈ మంటలు పాకుతాయని హెచ్చ రించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos