చిట్టి చెల్లి కోసం బుడతడి ఆరాటం…

చిట్టి చెల్లి కోసం బుడతడి ఆరాటం…

ఆకలవుతోందంటూ చెల్లెలు చెప్పడమే తరువాయి…ఆ అన్న కాసేపు నలభీముడిలా మారిపోయాడు. చిట్టి చేతులతో చక చకా వంట చేసి చెల్లెలికి తినిపించాడు. అంగడికి వెళ్లి ఏమైనా తీసుకొచ్చి చెల్లెలుకిద్దామనుకోలేదు. తల్లిదండ్రులకు చెప్పి చెల్లెలి ఆకలి తీర్చే పనీ చేయలేదు. ఎక్కడ చూసి నేర్చుకున్నాడో, ఏమో…క్షణాల్లో తానే వంటను పూర్తి చేశాడు. ఇండోనేషియాలోని ఈ దృశ్యం నెటిజన్లను అమాంతం ఆకట్టుకుంటోంది. చెల్లెలి కోసం వంట చేసే క్రమంలో గరిటె పట్టుకుని తిప్పడం చూస్తే, వీడో ఆరింద అని ఎవరికైనా అనిపించకమానదు. ఎప్పుడెప్పుడు ఏ దినుసు వేయాలో కూడా బాగా తెలిసినట్లుంది ఆ బాలునికి. తన చిన్ని చేతులతోనే ఫ్రైడ్ రైస్‌ను సిద్దం చేసి చెల్లెలికి తినిపించి, తానూ ఆరగించి, అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇలా ఉండాలని…చాటి చెప్పాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos