చిరుని చూసి అది నేర్చుకున్నా..

  • In Film
  • September 17, 2019
  • 114 Views
చిరుని చూసి అది నేర్చుకున్నా..

ఈగ చిత్రంతో తెలుగులో సైతం క్రేజ్ తెచ్చుకున్న కిచ్చ సుదీప్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప్‌కు చిరంజీవిని చూసి ఏం నేర్చుకున్నారంటూ ప్రశ్న ఎదురు కాగా రాజకీయాల్లోకి వెళ్లకూడదనే విషయాన్ని చిరంజీవిని చూసి నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు.పదేళ్లు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లడం తన వల్ల కాదని రాజకీయాల్లోకి వెళ్లలేనని చెప్పారు. తనను చాలా మంది రాజకీయాల్లోకి ఆహ్వానించారని కానీ తను వెళ్లలేదని అన్నారు. ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయని.. సినిమాకి మించిన రాజకీయాలు ఉండవని చెప్పారు. రాజకీయాల్లోకి వెళితే ఉదయం లేవగానే తిట్టుకుంటూ ఉండాలని.. అదే సినిమా ఇండస్ట్రీలో అయితే ఎవరు ఎక్కడ నుండి వచ్చారనేది కూడా తెలియదని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos