దిశ చట్టం పెద్ద బూటకం

దిశ చట్టం పెద్ద బూటకం

తెనాలి: ‘దిశ’ చట్టం బోగస్ అని హతురాలు అయేషా మారీ తండ్రి ఇక్బాల్ శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘ప్రజలకు ఉప యోగ పడే చట్టాలు చేయాలి. రాజకీయాల కోసం చట్టాలు చేయవద్దు. రేప్ చేసినట్టు తేలిన నేరస్థులకు 21 రోజుల్లో శిక్షలు వేయ డం సాధ్యం కాదు. సక్రమంగా దర్యాప్తు చేస్తే నిందితులను పట్టుకోవచ్చన్నా’రు. తన కుమార్తె అయేషా హత్య కేసులో సీబీఐ విచారణను ఎప్పటికి తేలుతుందో తెలియదని చెప్పారు. తాము ఆరోపించిన నిందితులను విచారించారో లేదా అన్న విషయం తమకు బోధపడటంలేదని పేర్కొన్నారు. అయేషా మీరా కేసులో గతంలో జరిగిన విచారణ అంతా బోగస్ అని చెప్పారు. 2007 లో డిసెంబర్ 27న విజయవాడ శివారు ప్రాంతాల్లో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సత్యంబాబు నిర్దోషిగా బయటపడటంతో నేరగాడు ఎవరో తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పన్నెండు ఏళ్ల కిందట ఖననం చేసిన ఆయేషా మీరా మృత దేహాన్ని శనివారం బయటకు మరో మారు పరీక్షించారు. పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలు గుర్తించారు. ఎముకల నుంచి పోరెన్సిక్ బృందం అవశేషాలను సేకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos